మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన తాజా చిత్రం “డ్యూడ్” పండుగ సీజన్ పూర్తయిన తర్వాత కూడా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. లవ్, కామెడీ ప్రధాన అంశాలతో రూపొందిన ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించగా కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించారు.
తాజాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సాలిడ్ విజయాన్ని అందుకుంది. దాంతో ఈ దీపావళి సీజన్‌లో ఈ మైలురాయిని చేరిన మొదటి సినిమాగా డ్యూడ్” నిలిచింది. “లవ్ టుడే”, “డ్రాగన్” తర్వాత ఇది ప్రదీప్ రంగనాథన్ కెరీర్‌లో వరుసగా మూడవ 100 కోట్ల సినిమాగా నిలిచింది.
మిడ్‌రేంజ్ హీరోకి ఈ స్థాయి వసూళ్లు సాధించడం గొప్ప విషయమే. మూడు సార్లు 100 కోట్ల క్లబ్‌లో చేరడం ప్రదీప్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. “డ్యూడ్” ఆయనను కొలీవుడ్‌లో వేగంగా ఎదుగుతున్న స్టార్‌గా మరోసారి నిరూపించింది. ఈ చిత్రంలో నేహా శెట్టి, శరత్‌కుమార్, రోహిణి, హృదు హరూన్, సత్య ముఖ్య పాత్రల్లో నటించగా సంగీతాన్ని సాయి అభ్యంకర్ అందించారు.
The submit వంద కోట్లతో డ్యూడ్.. హ్యాట్రిక్ హిట్‌తో అల్లాడించిన ప్రదీప్ first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.