Entertainment

ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన విజయ్ ఆంటోని ‘భద్రకాళి’

తమిళ నటుడు విజయ్ ఆంటోని తన కెరీర్‌లో 25వ చిత్రంగా రూపొందించిన ‘శక్తి తిరుమగన్’ చిత్రాన్ని తెలుగులో ‘భద్రకాళి’ పేరుతో రిలీజ్ చేశారు. ఈ
సినిమా బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ స్పందన తెచ్చుకుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాలో విజయ్ ఆంటోని తన నటనతో మెప్పించాడు.

ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో
స్ట్రీమింగ్ అవుతుంది. అరుణ్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వాగై చంద్రశేఖర్, సునీల్ కృపాలని, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర తదితరులు కీలక
పాత్రల్లో నటించారు.

ఈ సినిమాను విజయ్ ఆంటోని ప్రొడ్యూస్ చేయడంతో పాటు ఈ చిత్రానికి సంగీతం కూడా అందించాడు. మరి ఈ సినిమాకు ఓటీటీ ఆడియెన్స్ ఎలాంటి రెస్పాన్స్
అందిస్తారో చూడాలి.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

The put up ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన విజయ్ ఆంటోని ‘భద్రకాళి’ first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *