మలయాళంలో తెరకెక్కిన లేడీ సూపర్ హీరో చిత్రం ‘లోక చాప్టర్ 1’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను డొమినిక్ అరుణ్ తెరకెక్కించగా కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్‌లో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్ల వసూళ్లతో దుమ్ము లేపింది.
అయితే, ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఓటీటీ రైట్స్ దక్కించుకున్న జియో హాట్‌స్టార్ ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను అనౌన్స్ చేసింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 31 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
దీంతో ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ప్రేక్షకులు రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాను నటుడు దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూస్ చేయగా ఇందులో టోవినో థామస్ కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రాన్ని జియో హాట్‌స్టార్ మలయాళ, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠి భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది.
The submit ఎట్టకేలకు ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘కొత్త లోక చాప్టర్ 1’ first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.