Entertainment

శ్రీలంకకు పయనమైన ‘పెద్ది’.. అక్కడ ఏం చేస్తాడో తెలుసా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పెద్ది’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తుండగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ కోసం చిత్ర యూనిట్ శ్రీలంకకు పయనమయ్యారు. హీరో రామ్ చరణ్‌తో పాటు దర్శకుడు బుచ్చిబాబు సానా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి శ్రీలంకకు బయల్దేరిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా, శ్రీలంక షెడ్యూల్‌లో ఓ పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరించేందుకు ‘పెద్ది’ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ రగడ్ లుక్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మార్చి 26, 2026లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

The publish శ్రీలంకకు పయనమైన ‘పెద్ది’.. అక్కడ ఏం చేస్తాడో తెలుసా..? first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *