Entertainment

Kumari 22F: సుక్కూ భార్య కొత్త నిర్మాణ సంస్థలో కుమారి 21F సీక్వెల్

సుకుమార్, ఒకపక్క పాన్ ఇండియా లెవెల్ సినిమాలు చేస్తూనే, మరోపక్క తన శిష్యులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో సుకుమార్ రైటింగ్స్ పేరుతో ఒక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్‌లయ్యాయి.
అయితే, ఇప్పుడు సుకుమార్ కుటుంబం నుంచి మరో నిర్మాణ సంస్థ తెరమీదకు రాబోతోంది. సుకుమార్ భార్య తబిత కీలకంగా వ్యవహరించబోతున్న ఈ నిర్మాణ సంస్థ పేరు కూడా తబితా సుకుమార్ ఫిలింస్ అని తెలుస్తోంది.

Additionally Learn: Venkatesh: గురూజీ… వెంకీ మామతో ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా ?

ఇక ఈ సంస్థ నుంచి మొదటి సినిమాగా, గతంలో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన ‘కుమారి 21ఎఫ్’ సినిమాకి సీక్వెల్‌గా ‘కుమారి 22ఎఫ్’ అనే సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అదే డైరెక్టర్‌తో, నటీనటులలో మార్పులతో ఈ సినిమా రూపొందించబోతున్నట్లుగా సమాచారం. 2015లో రిలీజ్ అయిన ‘కుమారి 21ఎఫ్’ సినిమా అప్పట్లోనే ఒక ప్రోగ్రెసివ్ సినిమాగా యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. ఈ నేపథ్యంలో, సుమారు 10 ఏళ్ల తర్వాత వస్తున్న ఆ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారు మేకర్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *