Entertainment

ఫౌజీ పై ఇంట్రెస్టింగ్ బజ్.. నిజమైతే ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఖాయం!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ చిత్రంపై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రీసెంట్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ లుక్‌కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమాను పీరియాడిక్ డ్రామాగా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది.

అయితే, ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతుందనే వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు హను రాఘవపూడి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడని తెలుస్తోంది. 1940ల నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రభాస్ పాత్రకు సంబంధించి ఒకవైపు మాత్రమే మనం చూడబోతున్నామట. అయితే, సీక్వెల్‌లో మాత్రం ప్రభాస్ పాత్రను పూర్తిగా చూపెట్టబోతున్నారట. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ఇక ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అనుపమ్ ఖేర్‌, మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. మరి నిజంగానే ఫౌజీ సీక్వెల్ గనక ఉంటే ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఖాయమని చెప్పాలి.

The publish ఫౌజీ పై ఇంట్రెస్టింగ్ బజ్.. నిజమైతే ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఖాయం! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *