Entertainment

‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టులలో హీరో అడివి శేష్ నటిస్తున్న చిత్రం ‘డెకాయిట్’ కూడా ఒకటి. ఈ సినిమాను షానీల్ డియో డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. అయితే, ఈ సినిమా రిలీజ్ డేట్‌ను పలుమార్లు మారుస్తూ వచ్చారు. ఇక చివరగా క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

కానీ, ఇప్పటికే క్రిస్మస్ బరిలో చాలా సినిమాలు తమ రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకున్నాయి. దీనికి తోడు డెకాయిట్ చిత్రానికి సంబంధించిన కొన్ని పనులు కూడా బ్యాలెన్స్ ఉండటంతో ఈ సినిమా రిలీజ్ మారుతుందనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు మేకర్స్ నుండి కూడా ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది. డెకాయిట్ చిత్రానికి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్‌ను అక్టోబర్ 28న మధ్యాహ్నం 1.08 గంటలకు అనౌన్స్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఈ సినిమాలో అడివి శేష్ పూర్తి యాక్షన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు కమ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సుప్రియ యార్లగడ్డ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

The publish ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *