Entertainment

మరో రొమాంటిక్ సాంగ్‌తో వస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఎప్పుడంటే..?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. దర్శకుడు పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకు వివేక్-మెర్విన్ ద్వయం సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది.

ఈ సినిమా నుంచి మూడో సింగిల్ సాంగ్‌గా ఓ రొమాంటిక్ పాటను మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ‘చిన్ని గుండెలో’ అంటూ సాగే ఈ పాటలో హీరో రామ్ పోతినేని, హీరోయిన్ భాగ్యశ్రీ బొర్సె ల మధ్య వచ్చే కెమిస్ట్రీ ప్రేక్షకులను థ్రిల్ చేయబోతుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ రొమాంటిక్ సాంగ్‌ను అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు.

ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని నవంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

The publish మరో రొమాంటిక్ సాంగ్‌తో వస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఎప్పుడంటే..? first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *