రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వరుస ప్రాజెక్టులతో బిజీగా మారుతున్నారు. ఆయన ఇటీవల రెండు కొత్త సినిమాలకు ఓకే చెప్పారు. వాటిలో ఒకటి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న భారీ పీరియాడిక్ డ్రామా కాగా, మరోటి రవికిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న గ్రామీణ ఎంటర్‌టైనర్ “రౌడీ జనార్ధన్”.
మొదట రాహుల్ సాంకృత్యన్ సినిమా షూట్‌ను పూర్తి చేయాలనుకున్న విజయ్, ఆ చిత్రం భారీ బడ్జెట్‌తో పాటు విస్తృతమైన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉండటంతో తన ప్లాన్ మార్చుకున్నారు. దీంతో, ఆయన ముందుగా “రౌడీ జనార్ధన్” పై దృష్టి సారించారు.
ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్ ఈరోజు ప్రారంభమైంది. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ లో పాల్గొంటున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బృందం యోచిస్తోంది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలోని పీరియాడిక్ చిత్రం మాత్రం 2027లో విడుదల కానుంది.
The submit ప్లాన్ మార్చిన విజయ్ దేవరకొండ..? first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.