జి.డి.ఆర్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై జి.డి.నరసింహ దర్శకత్వంలో లక్ష్మణ్ టేకుముడి మరియు రాధికా జోషి ప్రధాన పాత్రల్లో శ్రీని ఇన్ఫ్రా నిర్మించిన చిత్రం ‘ప్రేమ లేదని’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఆద్యంతం గుండెల్ని తాకే ఎమోషనల్ లవ్ స్టోరీగా మేకర్స్ దీన్ని కట్ చేశారు.
లక్ష్మణ్ టేకుముడి-సురేష్ గురు జంటగా కనిపించే కామెడీ సీన్లు, హీరో-హీరోయిన్ల ప్రేమ, రొమాంటిక్ సన్నివేశాలు యూత్‌కి నచ్చే విధంగా ప్రజెంట్ చేశారు. జాన్ విక్టర్ పాల్ కెమెరా వర్క్, సుహాస్ సంగీతం ఈ టీజర్‌కు మేజర్ అసెట్‌గా నిలిచాయి.
ఇక ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉందని.. త్వరలోనే ఈ చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని మేకర్స్ వెల్లడించారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
The put up ఆకట్టుకుంటున్న ‘ప్రేమ లేదని’ చిత్ర టీజర్ first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.