Entertainment

జేడీ చక్రవర్తి చేతుల మీదుగా ‘ఓ.. చెలియా’ మెలోడీ సాంగ్ విడుదల

ఎస్‌ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రూపాశ్రీ కొపురు నిర్మిస్తున్న అందమైన ప్రేమ కథా చిత్రం ‘ఓ.. చెలియా’. నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎం. నాగ రాజశేఖర్ రెడ్డి కథ, కథనం, దర్శకత్వం అందిస్తున్నారు. ఇప్పటికే పోస్టర్లు, టీజర్, పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ మూవీ నుంచి తాజాగా మరో మెలోడీ సాంగ్ విడుదలైంది.

విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి ‘ఓ.. చెలియా’ నుంచి ‘నాకోసం ఆ వెన్నెల’ అంటూ సాగే ప్రేమ గీతాన్ని విడుదల చేశారు. ఎంఎం కుమార్ అందించిన హాయిగొలిపే సంగీతం, శివ సాహిత్యం, మేఘన, మనోజ్ గాత్రం శ్రోతలను కట్టిపడేస్తున్నాయి. హీరో, హీరోయిన్ల మధ్య అందమైన ప్రేమను ఈ పాట చాటుతోంది.

పాట విడుదల అనంతరం జేడీ చక్రవర్తి మాట్లాడుతూ.. పాట చాలా బాగుందని, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆకాంక్షించారు. సురేష్ బాలా కెమెరా వర్క్, ఉపేంద్ర ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

The put up జేడీ చక్రవర్తి చేతుల మీదుగా ‘ఓ.. చెలియా’ మెలోడీ సాంగ్ విడుదల first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *