Entertainment

ఇద్దరు స్టార్స్ రిజెక్ట్ చేశారు.. పవన్ ఓకే చేస్తాడా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా ‘ఓజీ’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర భారీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాను దర్శకుడు సుజీత్ డైరెక్ట్ చేయగా ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో ఇప్పుడు పవన్ తన నెక్స్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే, ఈ సినిమా తర్వాత మరో సినిమాను లైన్‌లో పెట్టేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నట్లు సినీ సర్కిల్స్ టాక్.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం తర్వాత తన నెక్స్ట్ చిత్రం కోసం పవన్ కథలను వింటున్నాడట. ఈ క్రమంలోనే దర్శకుడు వంశీ పైడిపల్లి ఆయనకు ఓ కథను వినిపించినట్లు తెలుస్తోంది. మంచి సోషల్ డ్రామా చిత్రంగా ఇది ఉండటంతో పవన్ ఆసక్తిని చూపాడట. అయితే, ఈ కథను బాలీవుడ్‌లో ఇద్దరు స్టార్స్ రిజెక్ట్ చేయడం గమనార్హం.

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తొలుత ఈ సినిమాకు ఓకే చెప్పాడు. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఇక మరో హీరో సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమా కథను విని రిజెక్ట్ చేశాడట. మరి ఇలా ఇద్దరు స్టార్స్ రిజెక్ట్ చేసిన సినిమాకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

The publish ఇద్దరు స్టార్స్ రిజెక్ట్ చేశారు.. పవన్ ఓకే చేస్తాడా..? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *