కన్నడలో తెరకెక్కిన ప్రెస్టీజియస్ సీక్వెల్ చిత్రం ‘కాంతార చాప్టర్ 1’ అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ సినిమాను రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి హీరోగా నటించాడు. ఇక ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది.
థియేటర్లలో సాలిడ్ రన్ కొనసాగిస్తున్న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కూడా ఇప్పటికే ఫిక్స్ అయింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 31న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానుంది. అయితే, ఓటీటీ డేట్ లాక్ చేసుకున్నప్పటికీ, ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ క్రేజ్‌తో దూసుకుపోతుంది.
బుక్ మై షోలో ఈ సినిమా ఇప్పటివరకు ఏకంగా 14 మిలియన్‌కు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. రోజుకు యావరేజ్‌గా 70వేల టికెట్లు అమ్ముడవుతున్నట్లు బుక్ మై షో వెల్లడించింది. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించగా, హొంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేశారు.
The submit ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ.. అయినా తగ్గని ‘కాంతార చాప్టర్ 1’ డిమాండ్ first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.