వీరసింహ రెడ్డితో సూపర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని బాలయ్యతో మరో సినిమా చేస్తున్నాడు. వీరసింహారెడ్డిలో బాలయ్య లుక్, గెటప్ ఓ రేంజ్ లో ఉందని ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకున్నాడు గోపీచంద్ మలినేని. ఈ నేపథ్యంలో ఈసారి గోపీచంద్ మలినేని, బాలయ్యతో చేసే సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఊర మాస్ సినిమా ప్లానింగ్ చేస్తున్నాడు గోపీచంద్ మలినేని. ఈ సినిమను వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మించనున్నారు. అఖండ 2 తర్వాత గోపిచంద్ మలినేని సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది.
Additionally Learn : Darshan Posani : జూనియర్ ప్రభాస్ గా సూపర్ స్టార్ మహేశ్ మేనల్లుడు
కాగా ఈ సినిమాలో హీరోయిన్ కోసం పలువురి పేర్లు పరిశీలించిన మేకర్స్ ఫైనల్ గా స్టార్ హీరోయిన్ ను ఫిక్స్ చేసారు. ఇదివరకు బాలయ్యతో శ్రీరామరాజ్యం, జై సింహ వంటి సూపర్ హిట్ మూవీస్ లో నటించింది లేడీ సూపర్ స్టార్ నయనతార. లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పడు మరోసారి బాలయ్యతో జోడి కడుతుంది నయన్. దర్శకుడు గోపీచంద్ మలినేని ఇటీవల నయన్ కు కలిసి కథ వినిపించగా అందుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని టాక్. ఈ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నటు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న ఈ సినిమా నవంబరు 7న పూజా కార్యక్రమాలతో స్టార్ట్ కానుంది. బాలయ్య కెరీర్ లోనే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కబోతుంది. ఈ సినిమాకు టాలీవుడ్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిచబోతున్నారు. బాలయ్య – నయన్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ఆశిద్దాం.