Entertainment

ఓటీటీని షేక్ చేస్తున్న గుజరాతీ హారర్ థ్రిల్లర్ కి నెట్ ఫ్లిక్స్ రికార్డ్ ధర?

కొన్ని కొన్ని సినిమాలకి ఆలస్యంగా అయినప్పటికీ ఇప్పుడు ఉన్న ఓటీటీ యుగంలో ఆడియెన్స్ లో నెమ్మదిగా అయినా కల్ట్ క్లాసిక్ గా నిలుపుతున్నారు. ఇలా లేటెస్ట్ కా ఓటీటీలో సంచలనం సెట్ చేస్తున్న ఓ సినిమానే “వష్ లెవెల్ 2”. నిజానికి ఇదొక గుజరాతీ సినిమా కాగా కొన్ని రోజులు కితమే ఓటీటీ లోకి ఈ సినిమా వచ్చింది.

కేవలం గుజరాతీ, హిందీలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సినిమాకి ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలన రెస్పాన్స్ కనిపిస్తుంది. ఇంతలా సంచలనం సెట్ చేస్తున్న ఈ క్రేజీ హారర్ థ్రిల్లర్ కి ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ కూడా భారీ మొత్తం అందించినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాని వారు మూడున్న కోట్లు పెట్టి కొన్నారట. పెద్దగా ఎవరికీ తెలీని నటీనటులు పైగా ఓ గుజరాతీ సినిమాకి ఈ రేంజ్ డీల్ అంటే అధికమే అని చెప్పాలి. అలా కొన్న ఈ సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో సూపర్ రెస్పాన్స్ తో ఇండియన్ ట్రెండ్స్ లో దూసుకెళ్తుంది. ఇక ఈ చిత్రానికి కృష్ణదేవ్ యగ్నిక్ దర్శకత్వం వహించగా కల్పేష్, కృనాల్ సోనిలు నిర్మాణం వహించారు.

The put up ఓటీటీని షేక్ చేస్తున్న గుజరాతీ హారర్ థ్రిల్లర్ కి నెట్ ఫ్లిక్స్ రికార్డ్ ధర? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *