Entertainment

Chiranjeevi : చిరంజీవిపై అసభ్య పోస్టులు.. రెండు కేసులు నమోదు

Chiranjeevi : సోషల్‌ మీడియాలో సినీనటుడు మెగాస్టార్‌ చిరంజీవిని లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు, డిప్‌ ఫేక్‌ వీడియోలు వైరల్‌ అవుతున్న నేపథ్యంలో, హైదరాబాద్ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో డీసీపీ కవిత మీడియాతో మాట్లాడారు. డీసీపీ కవిత వివరాల ప్రకారం.. చిరంజీవి ఫిర్యాదు మేరకు ఇప్పటివరకు రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చిరంజీవి ఫిర్యాదుతో రెండు కేసులు నమోదు చేసామన్నారు. 25 పోస్టులకు పైగా గుర్తించామని, వాటిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఈ వీడియోలు, పోస్టులు ఎక్కువగా ‘ఎక్స్‌’ (ట్విట్టర్‌) ప్లాట్‌ఫారమ్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి అని ఆమె పేర్కొన్నారు.

Hafiz Saeed: భారత్‌కు వ్యతిరేకంగా జిత్తులమారి నక్క హఫీజ్ సయీద్ కొత్త ప్లాన్ ?

అంతేకాకుండా.. చిరంజీవి ఈ ఘటనపై సివిల్‌, క్రిమినల్‌ రెండు మార్గాల్లో ముందుకు వెళ్తున్నారని డీసీపీ కవిత తెలిపారు. చిరంజీవి సివిల్‌ కోర్టుకు వెళ్ళారన్నారు. క్రిమినల్‌ కంప్లైంట్‌ ఆధారంగా మేము కేసులు నమోదు చేశామని, ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందిస్తూ సహాయం అందిస్తున్నామని చెప్పారు. డిప్‌ ఫేక్‌ టెక్నాలజీని కొంతమంది వ్యక్తులు దుర్వినియోగం చేస్తూ మోసం, బ్లాక్‌మెయిల్‌ ప్రయత్నాలకు పాల్పడుతున్నారని ఆమె హెచ్చరించారు. “డిప్‌ ఫేక్‌ ఘటనలు చిన్నవి కావు. ఇవి మోసం చేయడం, బ్లాక్‌మెయిల్‌ చేయడం కోసం వాడుతున్నారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదు. కేసులు నమోదు చేసి నోడల్‌ ఏజెన్సీకి పంపించాం,” అని డీసీపీ కవిత స్పష్టం చేశారు.

సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌పై అపోహలు పెట్టుకోవద్దని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. “ఎవరైనా సైబర్‌ నేరాల బాధితులుగా మారితే వెంటనే 1930 నంబర్‌కి లేదా హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను సంప్రదించవచ్చు. తక్షణ చర్యలు తీసుకుంటాం,” అని తెలిపారు. డిప్‌ ఫేక్‌ కంటెంట్‌ పెరుగుతున్న తరుణంలో, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి ఫేక్‌ వీడియోలు షేర్‌ చేయకూడదని డీసీపీ కవిత సూచించారు.

Visitors Regulations : హైదరాబాద్‌లో రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌ ఇక కుదరదు నాయనా..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *