1990 దశకంలో ఎన్నో ప్రేమకథా చిత్రాల్లో నటించి మెప్పించిన హీరో అబ్బాస్. పైగా ఆయన నటించిన హార్పిక్ యాడ్ కూడా జనంలోకి బాగా వెళ్ళింది. కానీ, ఆ తర్వాత అబ్బాస్ సినిమాలకు దూరంగా ఉన్నారు. పైగా న్యూజిలాండ్ లో సెటిల్ అయ్యారు. కాగా సింగర్, నటుడు రఘు కుంచె న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో అబ్బాస్‌ను ఆయన కలిశారు. ఈ సందర్భంగా రఘు కుంచె, అబ్బాస్ తో కలిసి ఓ ఫోటో కూడా దిగారు.
కాగా రఘు కుంచె ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, “అబ్బాస్‌ను చాలా ఏళ్ల తర్వాత కలవడం ఆనందంగా అనిపించింది. కొన్ని సినిమాల్లో ఆయనకు నేను డబ్బింగ్ చెప్పిన రోజులు గుర్తొచ్చాయి. మళ్లీ మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుంటున్నా’ అని రఘు కుంచె అన్నారు.
ప్రస్తుతం రఘు కుంచె – అబ్బాస్ కలిసి దిగిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు అబ్బాస్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
The post ఆ హీరో ఇలా మారిపోయాడేంటి ?, పిక్ వైరల్ ! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.