Entertainment

Raja Shekhar: కరోనా తర్వాత అలాంటి వ్యాధితో ఇబ్బంది పడుతున్న రాజశేఖర్.!

Raja Shekhar is suffering from such a disease after Corona

Raja Shekhar: తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు అనగానే చాలామందికి గుర్తుకు వచ్చేది చిరంజీవి, వెంకటేష్, రాజశేఖర్, నాగార్జున. వీరంతా ఒకే తరానికి చెందిన హీరోలు. ఇందులో రాజశేఖర్ హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాల్లో నటించారు. ఆయన ఏ సినిమా చేసినా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగారు. కొన్ని సంవత్సరాల పాటు తన మానియా నడిపించారు.

Raja Shekhar is suffering from such a disease after Corona

ఆ తర్వాత ఇండస్ట్రీలో సైలెంట్ అయిపోయిన రాజశేఖర్ గత కొంతకాలం నుంచి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అలాంటి ఈయన తాజాగా ఒక సినిమా ఈవెంట్ లో పాల్గొని తన పర్సనల్ లైఫ్ లో ఎదుర్కొంటున్న సమస్య గురించి బయటపెట్టారు.. అదేంటో వివరాలు చూద్దాం.. సింహరాశి, అంకుశం, అల్లరి ప్రియుడు,ఆయుధం వంటి సినిమాల ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న రాజశేఖర్ ఆ తర్వాత సినిమాలు లేక చాలా వరకు సైలెంట్ అయిపోయారు. (Raja Shekhar)

Also Read: Mega Family: ఆ విషయంలో నందమూరి ఫ్యామిలీ ఎప్పుడూ మెగా ఫ్యామిలీ తర్వాతే.. చూసి నేర్చుకోండయ్యా.!

2017లో పిఎస్ గరుడవేగాతో మళ్లీ కం బ్యాక్ ఇచ్చిన ఈయన కొంతవరకు సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత మరో రెండు చిత్రాలు చేసిన అవి పెద్దగా హిట్ కాలేదు. అలా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సమయంలోనే కరోనా వల్ల ఆయన తీవ్రమైన అనారోగ్యం పాలయ్యారు. అలా మెల్లిగా కోలుకొని 2023లో నితిన్ ఎక్స్త్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రంలో చేసి మళ్లీ చాలా గ్యాప్ ఇచ్చారు. అయితే తాజాగా హీరో శర్వానంద్ ‘బైకర్’ సినిమాలో ఈయన నటిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ మూవీ గ్లింప్స్ విడుదల సందర్భంగా రాజశేఖర్ ఒక ఈవెంట్ కు హాజరై పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

Raja Shekhar is suffering from such a disease after Corona

నేను చాలా రోజుల నుంచి ఇరిటేషన్ బౌల్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నానని, నాకు ఈ ఈవెంట్ కి రావాలనే సమాచారం అందగానే ఆ యాంగ్సైటితో నా కడుపు అంతా చెడిపోయిందని తెలియజేశారు. ఈ వ్యాధి వల్ల కడుపు ఉబ్బరం, విరేచనాలు, మల బద్ధకం వంటి సమస్యలు వస్తున్నాయని,దీనివల్లే నాకు రాత్రులు సరిగా నిద్ర పట్టడం లేదని చెప్పేశారు. అయితే ఈ వ్యాధి వల్ల నేను తరచూ కోపానికి వస్తున్నానని, ఎవరు ఏమనక పోయిన వారిపై అరుస్తూ ఉంటానని అన్నారు. నా గురించి తెలిసిన వాళ్ళు నేను పెద్దగా అరిచినా కానీ పట్టించుకోరని, తెలియని వాళ్ళతో ప్రాబ్లం వస్తుందని చెప్పుకొచ్చారు.(Raja Shekhar)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *