
Anushka: ఏంటి నాగార్జున సినిమా వల్ల అనుష్క ఏడాది పాటు ఇంట్లో నుండి బయటకు రాకుండా కన్నీళ్లు పెట్టుకుందా.. ఇంతకీ నాగార్జున సినిమా విషయంలో అనుష్కకి ఎదురైనా ఆ చేదు అనుభవం ఏంటి..ఎందుకు సంవత్సరం పాటు ఇంట్లోనే కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంది అనేది ఇప్పుడు చూద్దాం.. అనుష్క తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిందే నాగార్జున నటించిన సూపర్ మూవీ ద్వారా.. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకి కొత్త హీరోయిన్ ని పరిచయం చేయాలి అని పూరి జగన్నాథ్ అనుష్క ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
Anushka cried at home for a year because Nagaruna movie
అలా ఈ సినిమాతో అనుష్క కెరియర్ మారిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇక సూపర్ సినిమాలో అనుష్క కాస్త బోల్డ్ గా కనిపిస్తుంది.కానీ అనుష్క ఈ సినిమా చేశాక చాలా రోజులు బాధపడిందట. దానికి కారణం అనుష్క కర్ణాటక కి చెందిన అమ్మాయినే విషయం మనకు తెలుసు.అయితే అనుష్క ఫ్యామిలీ చాలా సంప్రదాయమైన కుటుంబమట.వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ కూడా పొట్టి బట్టలు వేసింది లేదట. (Anushka)
Also Read: Nagarjuna: నాగార్జున చేసిన పనికి రెండు రోజులు స్నానం చేయని హీరోయిన్..!
కానీ అలాంటిది మొట్ట మొదటిసారి సూపర్ సినిమా కోసం అనుష్క పొట్టి బట్టల్లో కనిపించాల్సి వచ్చింది. దాంతో మొట్టమొదటిసారి అలా పొట్టి బట్టలు వేసుకునేసరికి అనుష్కకు ఆ సినిమా చూశాక చాలా బాధేసిందట.ముఖ్యంగా ఎందుకు ఇలాంటి పొట్టి బట్టలు వేసుకొని సినిమాలో నటించానా అని సంవత్సరం పాటు చాలా బాధపడిందట.

ఇక అనుష్క కి అదే మొదటి సినిమా కావడంతో మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని సినిమాల్లో నటించడం కాస్త ఇబ్బందిగా అనిపించిందట. అలా ఇండస్ట్రీకి కొత్త కావడంతో పాటు మోడ్రన్ డ్రెస్సులు వేసుకున్నాను అనే కారణంతో అనుష్క సంవత్సరం పాటు సూపర్ సినిమా విషయంలో కన్నీళ్లు పెట్టుకుందట. కానీ ఈ సినిమా వల్ల అనుష్కకి పేరు రావడమే కాకుండా ఆ తర్వాత సౌత్ లో ఎన్నో సినిమాల్లో ఆఫర్స్ కూడా వచ్చాయి.(Anushka)