Entertainment

జటాధర నుంచి మరో ట్రీట్ రెడీ.. ఈసారి బాక్సులు బద్దలే..!

సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం ‘జటాధర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను వెంకట్ కళ్యాణ్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి మిస్టిక్ థ్రిల్లర్ చిత్రంగా రూపొందిస్తున్నారు. ఇక ఈ మూవీ పోస్టర్స్, సాంగ్ ఇప్పటికే మంచి రెస్పా్న్స్ తెచ్చుకున్నాయి.

అయితే, ఇప్పుడు ఈ సినిమా నుండి మరో ట్రీట్ రెడీ చేస్తున్నారు మేకర్స్. ఈ మూవీలోని రెండో సింగిల్ సాంగ్ ‘పల్లో లట్కె’ను అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక ఈ సాంగ్‌లో సుధీర్ బాబు, శ్రేయా శర్మ డ్యాన్స్ మూవ్స్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్ డెబ్యూ చేస్తోంది. ఇక ఈ సినిమాను ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింఘల్, నిఖిల్ నంద ప్రొడ్యూస్ చేస్తుండగా నవంబర్ 7న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

The put up జటాధర నుంచి మరో ట్రీట్ రెడీ.. ఈసారి బాక్సులు బద్దలే..! first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *