గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో ఓ సినిమా అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ, ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.
కానీ, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. త్వరలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ పూర్తిచేసిన పవన్, ఈ ప్రాజెక్ట్‌కి కూడా డేట్స్ కేటాయించనున్నాడాని తెలుస్తోంది. ఇక హీరోలను స్టైలిష్‌గా చూపించడంలో స్పెషలిస్ట్ అయిన సురేందర్ రెడ్డి ఈ సినిమాను ఎప్పుడెప్పుడు పట్టాలెక్కిస్తాడా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
మరి ఓజీ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న పవన్, సురేందర్ రెడ్డితో సినిమా చేస్తాడా లేడా అనేది ఆసక్తికరంగా మారింది.
The put up పవన్‌తో సురేందర్ రెడ్డి సినిమా.. మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది..! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.