Entertainment

సుకుమార్‌తో రామ్ చరణ్ అప్పుడే మొదలెడతాడా..?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కొత్త చిత్రం ‘పెద్ది’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రానున్న ఈ సినిమా ప్రస్తుతం పూణేలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

అయితే, ఈ సినిమా తర్వాత చరణ్ తన నెక్స్ట్ చిత్రాన్ని క్రియేటివ్ జీనియస్ సుకుమార్ డైరెక్షన్‌లో చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ గురించి ఎప్పుడు ఎలాంటి వార్త వచ్చినా అభిమానులు తప్పక ఫాలో అవుతున్నారు. అయితే, ఫిల్మ్ సర్కిల్స్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 2026లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. పెద్ది షూటింగ్ జనవరి 2026 వరకు కొనసాగనుండటంతో.. ఆ తర్వాత చరణ్ సుకుమార్ కొత్త చిత్రంపై కేర్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా రానుండటంతో ఈ మూవీ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

The submit సుకుమార్‌తో రామ్ చరణ్ అప్పుడే మొదలెడతాడా..? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *