Entertainment

300 కోట్ల గ్రాస్ తో చరిత్ర సృష్టించిన యంగ్ హీరోయిన్

రీసెంట్ గా వచ్చి సెన్సేషన్ ని సెట్ చేసిన చిత్రాల్లో ఒకటే లోక చాప్టర్ 1. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిన్ ప్రధాన పాత్రలో యువ హీరో నెస్లన్ నటించిన ఈ చిత్రాన్ని డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. మలయాళ సినిమా నుంచే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర ఒక సరికొత్త సూపర్ హీరో సినిమాగా అందులోని మొదటి ఫీమేల్ సూపర్ హీరోయిన్ సినిమాగా వచ్చిన ఈ చిత్రం వసూళ్ల పరంగా కూడా అదరగొట్టింది.

ఇలా మలయాళ సినిమా దగ్గర కొత్త నంబర్స్ సెట్ చేసి కొత్త ఇండస్ట్రీ హిట్ నిలిచిన ఈ సినిమా లేటెస్ట్ గా 300 కోట్ల గ్రాస్ ని అందుకొని మరో హిస్టరీ క్రియేట్ చేసింది. దీనితో మన సౌత్ లో ఇలాంటి ఇండస్ట్రీ హిట్ ఉన్న హీరోయిన్ గా కళ్యాణి ప్రియదర్శిన్ హిస్టరీ సెట్ చేసింది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ నిర్మాణం వహించగా ఈ ఫ్రాంచైజ్ లో మరిన్ని రానున్న సంగతి తెలిసిందే.

The publish 300 కోట్ల గ్రాస్ తో చరిత్ర సృష్టించిన యంగ్ హీరోయిన్ first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *