Entertainment

దీపావళి రిలీజ్‌లు.. కిరణ్ అబ్బవరం ‘ర్యాంప్’ ఆడిస్తాడా..?

దీపావళి పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు పలు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ దీపావళి బరిలో మూడు తెలుగు సినిమాలతో పాటు ఓ తమిళ డబ్బింగ్ సినిమా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చాయి. వీటిలో అందరికంటే ముందుగా ‘మిత్ర మండలి’ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో ప్రియదర్శి, నిహారిక ఎన్ఎం, విష్ణు ఓఇ, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

ఇక సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ముఖ్య పాత్రల్లో నటించిన ‘తెలుసు కదా’, తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ చిత్రాలు నేడు వరల్డ్‌వైడ్ రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాల్లో ‘తెలుసు కదా’కు డీసెంట్ టాక్ రాగా, ‘డ్యూడ్’ చిత్రానికి కాస్త ఎక్కువ మార్కులు పడ్డాయి. ఇక దీంతో ఇప్పుడు దీపావళి బరిలో మిగిలి ఉన్న ‘కె-ర్యాంప్’ చిత్రంపైనే అందరి కళ్లు ఉన్నాయి.

ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం నిజంగానే బాక్సాఫీస్ దగ్గర ర్యాంప్ ఆడిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఒకవేళ ఈ సినిమాకు గనక బెటర్ టాక్ వస్తే, ఈ దీపావళి బరిలో విజేతగా ‘కె-ర్యాంప్’ నిలిచే అవకాశం ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే.

The put up దీపావళి రిలీజ్‌లు.. కిరణ్ అబ్బవరం ‘ర్యాంప్’ ఆడిస్తాడా..? first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *