శుభప్రదం – ఒక సంపూర్ణ కుటుంబ షాపింగ్ గమ్యం. గుంతకల్లు నగరంలో శుక్రవారం జరిగిన ఈ ప్రారంభోత్సవం అద్భుతంగా, ఉత్సాహంగా జరిగింది. ప్రముఖ నటీమణులు ఐశ్వర్య రాజేష్, రితిక నాయక్ చేతుల మీదుగా శుభప్రదం ఫ్యామిలీ షాపింగ్ మాల్ ప్రారంభం జరిగింది. రైల్వే స్టేషన్ రోడ్‌లోని ఐడిబిఐ బ్యాంక్ ఎదురుగా ఈ మెగా ఈవెంట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా గుంతకల్లు ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరాం గారు, మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి నంగినేని భవాని గారు పాల్గొని, మాల్ నిర్వాహకులను అభినందించారు. గుంతకల్లు పట్టణంలో ఇంత అద్భుతమైన మాల్ ఏర్పాటుచేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.
నాణ్యమైన వస్త్రాలు, అందరికీ అందుబాటు ధరలు, అద్భుతమైన ఫ్యాషన్ కలెక్షన్లు, స్నేహపూర్వక సేవలు – ఇవన్నీ శుభప్రదం ప్రత్యేకతలుగా నిలుస్తాయని నిర్వాహకులు సత్తిబాబు గారు, సునీత గారు, ప్రసాద్ గారు తెలిపారు.
తమ తొలి స్టోర్‌ను గుంతకల్లులో ప్రారంభించడంపై అల్లకాస్ సత్యనారాయణ గారు ఆనందం వ్యక్తం చేస్తూ, ఈ మాల్ గుంతకల్లు ప్రజల జీవనశైలిని నూతన దిశలోకి తీసుకెళ్తుందని చెప్పారు. తక్కువ ధరల్లో ఆకర్షణీయమైన ఆఫర్లతో శుభప్రదం ప్రజలను ఆహ్వానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
శుభప్రదంతో… ప్రతి కొనుగోలు జయప్రదం – ప్రతి చిరునవ్వు శుభప్రదం!