Entertainment

Trimukha : సన్నీ లియోన్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ‘త్రిముఖ’

అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ మీద డాక్టర్ శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మాతలుగా బాలీవుడ్ స్టార్ సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా చిత్రం ‘త్రిముఖ’. రాజేష్ నాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో ఐదు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తూ అక్టోబర్ 18న టీజర్‌ను విడుదల చేశారు. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో రాబోతోన్న ఈ మూవీ డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Additionally Learn : Okay Ramp: క రికార్డ్ బద్దలు కొట్టలేక పోయిన కె ర్యాంప్

టీజర్‌లో సన్నీ లియోన్‌ను పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ శివంగి పాత్రలో చూపించారు. ‘ఓటమి ఎరుగని శివంగి.. కానీ ఎదురుగా యుద్దం.. తాను ఎప్పుడైనా సిద్ధం.. ఇప్పుడు ఎదురైంది ఛేదించలేని పద్మవ్యూహం.. తన చుట్టూ అలుముకుంది సందిగ్ధం.. కనుసైగతో సమస్యను గ్రహించే విషయపరిజ్ఞాని.. సమస్తమూ చదివిన జ్ఞాని.. అహంకారాన్ని అదుపు చేసుకోలేని అజ్ఞాని’ అంటూ వచ్చిన ఈ టీజర్ అదిరిపోయింది. యాక్షన్ సీక్వెన్స్‌లు, అద్భుతమైన విజువల్స్, థ్రిల్లింగ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇలా అన్నీ కూడా హైలైట్‌గా నిలిచాయి. ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను పెంచేసింది.చిత్ర నిర్మాత డాక్టర్ శ్రీదేవి మద్దాలి మాట్లాడుతూ, ‘‘త్రిముఖ’ టీజర్‌ను ఐదు భాషల్లో విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఇలా ఐదు భాషల్లో రిలీజ్ చేయడం మా కథపై, సినిమాపై మాకున్న నమ్మకానికి నిదర్శనమని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా మేము ఒక అద్భుతమైన అనుభవాన్ని రూపొందిస్తున్నాము. ఇది ప్రారంభం మాత్రమే. డిసెంబర్‌లో మా సినిమాను విడుదల చేయబోతోన్నాము’’ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *