మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మాస్ జాతర’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. దర్శకుడు భాను బోగవరపు డైరెక్ట్ చేస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ నుంచి దీపావళి కానుకగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ సినిమా నుంచి ‘సూపర్ డూపర్ హిట్టు సాంగ్’ అనే పాటకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఔట్ అండ్ ఔట్ ఎనర్జిటిక్ సాంగ్‌గా ఈ పాట ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ పాటను అక్టోబర్ 22న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
The put up ‘సూపర్ డూపర్’ సాంగ్‌కు డేట్ ఫిక్స్ చేసిన మాస్ రాజా..! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.