Entertainment

Kantara: Bankruptcy 1: ఇండియాలో ఫస్ట్ మూవీగా కాంతార రికార్డు

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటిస్తూ, ప్రఖ్యాత నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ‘కాంతార: చాప్టర్ 1’. అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకొని ఘన విజయాన్ని అందుకుంది. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద కొత్త బెంచ్‌మార్క్‌లను సృష్టించింది. విజువల్ వండర్‌గా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ సినిమా, విమర్శకుల నుంచి సైతం అద్భుతమైన ప్రశంసలు దక్కించుకుంది. కన్నడ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడమే కాకుండా, తెలుగులో 100 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 800 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. విడుదలైన అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

Additionally Learn:Bison : ‘బైసన్’ పై అనుపమ పరమేశ్వరన్ ఎమోషనల్ రియాక్షన్..

ఇప్పుడు, ‘కాంతార: చాప్టర్ 1’ మరో అరుదైన మైలురాయిని అందుకుంది. ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ ఇంగ్లీష్ వెర్షన్ అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. లేటెస్ట్ ఇంగ్లీష్ వెర్షన్ కోసం చిత్ర బృందం రన్ టైం తగ్గించినట్లు సమాచారం. ఈ వెర్షన్ 2 గంటలు, 45 నిమిషాలు, 40 సెకన్ల నిడివితో ఉండనుంది. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ‘కాంతార’కి ప్రీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార: చాప్టర్ 1’, ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద తన సక్సెస్ ఫుల్ రన్‌ను కొనసాగిస్తూ సంచలనం సృష్టిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *