
Allu Sirish: అల్లు శిరీష్ ఫైనల్ గా ఓ ఇంటి వాడు కాబోతున్నాడు.అక్టోబర్ 31న అల్లు అరవింద్ నివాసంలో అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ ఎంగేజ్మెంట్లో ఎంతోమంది సినిమా సెలబ్రెటీలతో పాటు బంధువులు సన్నిహితులు ఇలా ఎంతో మంది పాల్గొన్నారు. అయితే తాజాగా అల్లు శిరీష్ తన ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. అంతేకాదు అల్లు శిరీష్ కి కాబోయే భార్య గురించి కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. అయితే అల్లు శిరీష్ కి కాబోయే భార్య నయనిక ఆ హీరో బంధువు అంటూ ఒక రూమర్ చక్కర్లు కొడుతోంది.
Is Allu Sirish fiancée a relative of that star hero
ఇక విషయం ఏమిటంటే..హీరో నితిన్ కి నయనిక దూరపు బంధువు అన్నట్టు రూమర్లు వినిపిస్తున్నాయి. కానీ నితిన్ కి నయనిక బంధువు కాదు. నితిన్ భార్య శాలినికి నయనిక క్లోజ్ ఫ్రెండ్.. అలా శాలిని వల్లే అల్లు శిరీష్ నయనికల పెళ్లి జరుగుతుందట. ఇక ఈ విషయాన్ని తాజాగా అల్లు శిరీష్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టి తన లవ్ స్టోరీ ని రివీల్ చేశారు. అందులో ఏముందంటే.. నయనిక ని నేను మొదటిసారి కలిసింది నితిన్,శాలిని ఇచ్చిన పార్టీలో.. (Allu Sirish)
Also Read: Nagarjuna: నాగార్జున చేసిన పనికి రెండు రోజులు స్నానం చేయని హీరోయిన్..!
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ల పెళ్ళికి ముందు నితిన్ వరుణ్ తేజ్ లావణ్య జంటకి పార్టీ ఇచ్చారు. ఆ సమయంలో నేను కూడా అక్కడికి వెళ్లాను. అలా ఈ పార్టీలో నితిన్ భార్య శాలిని ఫ్రెండ్ నయనిక కూడా పాల్గొనడంతో అదే సమయంలో నాకు నయనిక కు మధ్య పరిచయం ఏర్పడింది.అలా ఫ్రెండ్స్ గా ఏర్పడిన మా బంధం ఫైనల్ గా పెళ్లికి దారి తీసింది. అంటూ ఇదే విషయాన్ని శిరీష్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా బయటపెట్టారు.. నా పిల్లలకి కూడా నా లవ్ స్టోరీ ని చెబుతాను అంటూ శిరీష్ పోస్ట్ పెట్టారు..

అంతేకాదు నితిన్ భార్య శాలిని మీ లవ్ జర్నీలో భాగమైనందుకు ఆనందంగా ఉంది అని పోస్ట్ పెడితే థాంక్యూ పెళ్లి పెద్ద అని రిప్లై ఇచ్చాడు.. ప్రస్తుతం అల్లు శిరీష్ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. అంతేకాదు అల్లు శిరీష్ వరుణ్ తేజ్ పెళ్లైనప్పటి నుండే నయనికతో డేటింగ్ లో ఉన్నారట.అలా రెండేళ్లుగా తన ప్రేమ విషయాన్ని ఎక్కడా కూడా బయటపడకుండా చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేశాడు.(Allu Sirish)