Entertainment

ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన సందీప్ రెడ్డి..!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుండి వరుస అప్డేట్స్ సందడి చేశాయి. ‘ది రాజా సాబ్’ చిత్రం నుండి
ఓ కలర్‌ఫుల్ పోస్టర్ రిలీజ్ అవగా.. ‘ఫౌజీ’ మూవీ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేశారు. ఈ రెండు కూడా ప్రభాస్ అభిమానులను మెప్పించాయి.
కానీ, వారికి పూర్తిగా బర్త్ డే ట్రీట్ అందినట్లు అనిపించలేదు.

అయితే, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చేశాడు. ప్రభాస్‌తో ఆయన అనౌన్స్ చేసిన ‘స్పిరిట్’ మూవీ నుంచి ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ వదిలాడు. కేవలం ఆడియో రూపంలో వచ్చిన ఓ వీడియోలో ‘స్పిరిట్’లో ప్రభాస్ పాత్రను ఎలివేట్ చేసిన తీరు ఆకట్టుకుంది. స్పిరిట్
మూవీలో ప్రభాస్ ఓ రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ జైలుకి వెళ్తాడని.. అక్కడ సూపరింటెండెంట్ అయిన ప్రకాష్ రాజ్ ప్రభాస్‌ను ట్రీట్ చేసే ఆడియో మనకు ఇందులో వినిపిస్తుంది.
ఇక చివర్లో ప్రభాస్.. ‘‘నాకు ఒక బ్యాడ్ హాబిట్ ఉంది..’’ అంటూ చెప్పిన డైలాగ్‌తో ఈ వీడియోను ముగించిన తీరుతో సందీప్ రెడ్డి ఫ్యాన్స్‌కు
అదిరిపోయే ట్రీట్ అందించాడు. ఇక ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి, వివేక్ ఓబెరాయ్, కాంచన, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

The publish ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన సందీప్ రెడ్డి..! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *