Entertainment

Singer Chinmayi: లైంగిక దాడులు ప్రోత్సహిస్తున్నారు.. రామ్ చరణ్ కి సింగర్ చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.!

Singer Chinmayi strong counter to Ram Charan

Singer Chinmayi: సింగర్ చిన్మయి ఎప్పుడు సోషల్ మీడియాలో తన ట్వీట్ ల ద్వారా యాక్టివ్గానే ఉంటుంది. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ పట్ల ఎప్పుడు ఏదో ఒక ట్వీట్ చేస్తూ హాట్ టాపిక్ అవుతుంది. అలా తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన ట్వీట్ నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. మరి ఇంతకీ చిన్మయి పెట్టిన ఆ ట్వీట్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. గత కొద్దిరోజులుగా సింగర్ కార్తీక్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు వస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Singer Chinmayi strong counter to Ram Charan

ఇక తన దగ్గర పని చేసే లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు చేయడంతో పాటు కేసు కూడా పెట్టింది.ఈ కేసులో జానీ మాస్టర్ జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అయితే ప్రస్తుతం ఆయన ఇంకా నిర్దోషిగా తేలలేదు. ఇలాంటి సమయంలో జానీ మాస్టర్ కి అవకాశాలు ఇవ్వడంపై సంచలన ట్వీట్ చేసింది చిన్మయి.. డబ్బును, అధికారాన్ని దుర్వినియోగం చేసే వారి చేతుల్లో పెట్టకూడదు. అలాగే సింగర్ కార్తీక్, జానీ మాస్టర్ లాంటి వాళ్లకు అవకాశాలు ఇచ్చారంటే కచ్చితంగా లైంగిక వేధింపులను ప్రోత్సహించినట్టే. (Singer Chinmayi)

Also Read: Raja Shekhar: కరోనా తర్వాత అలాంటి వ్యాధితో ఇబ్బంది పడుతున్న రాజశేఖర్.!

మనం నమ్మే కర్మ సిద్ధాంతం నిజమైతే కచ్చితంగా కర్మ ఎవరిని వదిలిపెట్టదు అంటూ సంచలన ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్లో జానీ మాస్టర్, కార్తీక్ ల పేర్లు మెన్షన్ చేయడంతో ఈట్వీట్ నెట్టింట్లో దుమారం సృష్టిస్తోంది. అయితే జానీ మాస్టర్ కి రీసెంట్గా పెద్ది సినిమాలో రామ్ చరణ్ కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చారు. దీంతో రామ్ చరణ్ జానీ మాస్టర్ ని తన సినిమా కోసం తీసుకున్నారంటే చిన్మయి పెట్టిన ట్వీట్ ప్రకారం రామ్ చరణ్ లైంగిక వేధింపుల్ని ప్రోత్సహిస్తున్నట్టే అర్థమవుతుంది.

Singer Chinmayi strong counter to Ram Charan

అంటే డైరెక్ట్ గా చిన్మయి రామ్ చరణ్ కి కౌంటర్ ఇచ్చినట్టే అంటున్నారు చాలా మంది నెటిజన్లు. ఇక మరి కొంతమందేమో జానీ మాస్టర్ పై లైంగిక వేధింపులపై ఆరోపణలు మాత్రమే వచ్చాయి. ఆయన ఇంకా దోషి అని తెలియలేదు. దోషి అని తెలియకుండా దోషి అనే ముద్ర ఎలా వేస్తారు అంటూ జానీ మాస్టర్ కి అండగా నిలుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ చిన్మయి చేసిన ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో దుమారం సృష్టిస్తుంది.(Singer Chinmayi)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *