
Womens World Cup 2025: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ విశ్వ విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగింది. నవీ ముంబై స్టేడియం లో ఈ మ్యాచ్ నిర్వహించారు. నిన్న జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టు పైన 52 పరుగుల తేడాతో విజయం సాధించి ఛాంపియన్ గా నిలిచింది టీం ఇండియా. Womens World Cup 2025
Womens World Cup 2025 BCCI announces more cash prize than ICC for India’s Women’s World Cup-winning team
దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు టీమిండియా అభిమానులు. 1973 నుంచి ఇప్పటివరకు టీమిండియా మహిళల జట్టు వరల్డ్ కప్ గెలవలేకపోయింది. కానీ హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో తాజాగా ఛాంపియన్ గా నిలిచింది. అయితే తొలిసారిగా ఛాంపియన్ అయినా టీమిండియా జట్టుకు భారీ నెజరానా రానుంది.Womens World Cup 2025
Also Read: KK Survey: కాంగ్రెస్ కు వణుకుపుట్టిస్తున్న KK సర్వే… ప్రతి గల్లీలో BRS దే…
ఐసీసీ నుంచి దాదాపు 40 కోట్లు ఛాంపియన్ జట్టు అయిన టీం ఇండియాకు రానున్నాయి. అలాగే భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా 52 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది. దీంతో టీమిండియా కు దాదాపు 90 కోట్ల వరకు నజరానా రానున్నాయి. Womens World Cup 2025
Also Read: Chandrababu Car: చంద్రబాబు కారుపై సరికొత్త చర్చ.. దీని వెనుక ఇంత సీక్రెట్ ఉందా…