Politics

KTR: కేటీఆర్ కొత్త వ్యూహం…కాంగ్రెస్ లో కొత్త టెన్ష‌న్‌..జూబ్లీహిల్స్ డిపాజిట్లు క‌ష్ట‌మేనా?

KTR: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ చుట్టే రాజ‌కీయాలు కొన‌సాగుతున్నాయి. న‌వంబ‌ర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ నియోజ‌క వ‌ర్గ ఉప ఎన్నిక జ‌రుగ‌నుంది. కౌంటింగ్ న‌వంబ‌ర్ 14వ తేదీన జ‌రుగ‌నుంది. అయితే, ఈ త‌రుణంలోనే అన్ని పార్టీలు జోరుగా ప్ర‌చారం సాగిస్తున్నాయి. శుక్ర వారం నుంచి కేటీఆర్ కూడా రంగంలోకి దిగారు. షేక్‌పేటలో కేటీఆర్‌ రోడ్ షో నిర్వ‌హించారు. KTR

KTR new strategy new tension in Congress is it difficult to get Jubilee Hills deposits

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు.. కాంగ్రెస్ పార్టీకి ముచ్చ‌ట‌మ‌లు తెప్పిస్తున్నాయి. జూబ్లీహిల్స్‌ మళ్లీ కొడుతున్నామ‌ని ప్ర‌క‌టించారు కేటీఆర్‌. ఇక్కడ గెలుపు పక్కా.. కానీ మెజార్టీ ఎంతో తేలాల్సి ఉందని సంచ‌ల‌న వ్యాక్య‌లు చేశారు కేటీఆర్‌. 2023 ఎన్నికల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్‌ లో కూడా మాగంటి గోపినాథ్‌ను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించారని తెలిపారు కేటీఆర్‌. KTR

Also Read: Womens World Cup 2025: వర్షం గండం…ఫైనల్ మ్యాచ్ రద్దయితే.. విజేత ఎవరంటే ?

నియోజకవర్గంలో మాగంటి గోపినాథ్‌ ప్రతి ఒక్కరికి అండగా నిలిచారన్నారు. దురదృష్టవశాత్తూ ఆరోగ్య సమస్యలతో గోపినాథ్‌ గారు కన్నుమూశారని వెల్ల‌డించారు. మీరంతా మాగంటి సునీతను ఆశీర్వదించాలని కోరారు. కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు కేటీఆర్‌. కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలంటే.. జైత్రయాత్ర ఇక్కడి నుంచే ప్రారంభం కావాలని తెలిపారు. అయితే, కేటీఆర్ నిర్వ‌హించిన ఈ ఒక్క రోడ్ షో… కాంగ్రెస్ పార్టీని వ‌ణికిస్తోంద‌ని అంటున్నారు. KTR

Also Read: Congress: తెలంగాణలో మరో రెండు మంత్రి పదవులు.. ఎవరికి ఛాన్స్ అంటే ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *