Politics

KK Survey: కాంగ్రెస్ కు వణుకుపుట్టిస్తున్న KK సర్వే… ప్రతి గల్లీలో BRS దే హవా?

KK Survey
KK Survey

KK Survey: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఉప ఎన్నికకు మరో తొమ్మిది రోజుల సమయం ఉన్న నేపథ్యంలో కేకే సర్వే తమ ఫలితాలను విడుదల చేసి… కాంగ్రెస్ పార్టీ నేతల ఆత్మవిశ్వాసం పై దెబ్బతీసింది. ఈ కేకే సర్వే ప్రకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో గులాబీ పార్టీ జెండా ఎగురవేయడం గ్యారెంటీ అని తెలుస్తోంది. కాంగ్రెస్ కంటే దాదాపు 18 శాతం ఓట్లు గులాబీ పార్టీకి పడతాయని కేకే సర్వే వెల్లడించింది. KK Survey

KK Survey on Jubilee Hills By Election

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కేకే సర్వే చెప్పిన రిజల్ట్ కరెక్ట్ అయ్యాయి. కేకే సర్వే ప్రకారం జగన్మోహన్ రెడ్డికి సరిగ్గా 11 సీట్లు మాత్రమే వచ్చాయి. జనసేన వందకు వంద శాతం స్ట్రైక్ రేట్ సంపాదించింది. అదే కేకే సర్వే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఎవరు గెలిచేది.. కుండ బద్దలు కొట్టి చెప్పింది. ప్రస్తుత ట్రెండు ప్రకారం గులాబీ పార్టీకి 55.2 % ఓట్ల పర్సెంటేజ్ పడబోతున్నట్లు వెల్లడించింది కేకే సర్వే. KK Survey

Also Read: Revanth Reddy: రేవంత్ టంగ్ స్లిప్‌…అజారుద్దీన్ నాయకత్వంలో ఇండియాకు వరల్డ్ కప్ ?

కాంగ్రెస్ పార్టీకి 37.8% ఓట్ శాతం ఉంటుందట. అదే భారతీయ జనతా పార్టీకి కేవలం ఏడు శాతం వస్తుందని స్పష్టం చేసింది కేకే సర్వే. గులాబీ పార్టీకి 2023 నుంచి ఉన్న ఓటు బ్యాంకు అలాగే ఉంటూ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటు గులాబీ పార్టీ వైపు ఈసారి షిఫ్ట్ కాబోతున్నట్లు ఈ సర్వే స్పష్టం చేసింది. హైడ్రా, ఆరు గ్యారంటీల ఎగవేత నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ వైబ్రేషన్స్ గ్రౌండ్ స్థాయిలో ఉన్నట్లు కేకే సర్వీస్ స్పష్టం చేసింది. ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డా కూడా గెలవడం కష్టమేనని ఈ సర్వే తెలిపింది. మరి ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. KK Survey

Also Read: Jemimah Rodrigues: అప్ప‌టి వ‌ర‌కు హీరో, ఇప్పుడు జీరో.. జెమిమా రోడ్రిగ్స్ పై ట్రోలింగ్స్‌…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *