
Tea: టీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలామంది టీ తాగుతూ ఉంటారు. టీ తాగడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిసినప్పటికీ టీ తాగకుండా ఎవరూ ఉండరు. టీ తాగడం వల్ల గ్యాస్, అసిడిటీ లాంటి సమస్యలు వస్తాయి. టీని ఖాళీ కడుపుతో అస్సలు తాగకూడదు. టీ తాగే ముందు ఒక గ్లాసడు నీరు తాగడం చాలా మంచిది. నీరు తాగిన తర్వాత టీ తాగినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. టీ తాగిన వెంటనే నీరు అస్సలు తాగకూడదు. టీ తాగిన తర్వాత పొరపాటున కూడా నీరు తాగినట్లయితే అది తీవ్రమైన ఒత్తిడిని తీసుకువస్తుంది. శరీరంలో విష వాయువులు విడుదల అవుతాయి. దానివల్ల శరీరం అంతటా చెడు బ్యాక్టీరియా ఏర్పడి స్కిన్ ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలకు దారితీస్తుంది. Tea
Tea provides benefits like improved heart health, mental alertness,
అంతేకాకుండా టీ తాగిన తర్వాత నీటిని తాగినట్లయితే దానివల్ల జలుబు, దగ్గు లాంటి సమస్యలు వస్తాయి ముక్కు నుంచి రక్తం కారుతుంది. దంత సమస్యలు ఏర్పడతాయి. పళ్ళు పుచ్చిపోవడం, విరిగిపోవడం లాంటి ఇబ్బందులు ఏర్పడతాయి. టీ తాగిన తర్వాత చల్లటి నీరు తాగే అలవాటు ఉన్నట్లయితే పూర్తిగా మానుకోవాలి. దంత సమస్యలు ఉన్నవారు టీ తాగిన తర్వాత నీరు తాగినట్లయితే ఆ సమస్యలు మరింతగా పెరుగుతాయి. వేడి లేక చల్లటి ఆహారం తిన్న తర్వాత చాలామందికి పళ్ళ సమస్యలు ఉంటాయి. పళ్ళు జివ్వుమనడం లాగడం లాంటి సమస్యలు ఏర్పడతాయి. టీ తాగిన తర్వాత కనీసం అరగంట పాటు నీటిని తాగకుండా ఉండాలి. అత్యవసరమైతే తప్ప అసలు తాగకూడదు. అత్యవసర సమయంలో కూడా ఒక సిప్ మాత్రమే నీటిని తాగాలి ఎక్కువగా తాగకూడదు. Tea
Also Read: Womens World Cup 2025: వర్షం గండం…ఫైనల్ మ్యాచ్ రద్దయితే.. విజేత ఎవరంటే ?
టీని కూడా ఎక్కువగా తాగినట్లయితే ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. టీని పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. అధికంగా తాగినట్లయితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రతిరోజు ఉదయం, రాత్రి కేవలం రెండు సమయాల్లో మాత్రమే టీ ని తాగాలి. అంతకుమించి అస్సలు తాగకూడదు. ఎక్కువగా తాగడం వల్ల గుండె సంబంధ సమస్యలు అధికంగా ఏర్పడతాయి. టీ అధికంగా తాగేవారికి ఆహారం జీర్ణం కాదు. జీర్ణ సంబంధ సమస్యలు ఏర్పడతాయి. తీసుకున్న ఆహారం తొందరగా జీర్ణం అవక అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. టీ తాగడం వల్ల కొంతమందికి స్కిన్ ఎలర్జీ ఏర్పడుతుంది. మొటిమలు లాంటి సమస్యలు అధికంగా వస్తాయి అలాంటివారు టీ ని తాగకపోవడమే మంచిది. Tea
Also Read: Congress: తెలంగాణలో మరో రెండు మంత్రి పదవులు.. ఎవరికి ఛాన్స్ అంటే ?