
Jemimah Rodrigues: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ దశకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య రేపు జరగనుంది. నవంబర్ రెండవ తేదీన ముంబై వేదికగా మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ ఫైనల్ కంటే ముందు ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా మధ్య సెమీఫైనల్ మొన్న ఇదే ముంబై వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. Jemimah Rodrigues
jemimah rodrigues jesus controversy
ఇందులో జెమిమా రోడ్రిగ్స్ అద్భుతంగా ఆడి టీమిండియాను గెలిపించింది. సెంచరీకి పైగా పరుగులు చేసి దుమ్ము లేపింది. చివరి వరకు పోరాడిన జెమిమా రోడ్రిగ్స్, జట్టును ఫైనల్ కు తీసుకువెళ్లింది. అయితే సెమీ ఫైనల్ మ్యాచ్ పూర్తయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ అంత జీసస్ చేశాడు… ఆయనే నడిపించాడు… ఆయన వల్లే టీమిండియా గెలిచిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది జెమిమా రోడ్రిగ్స్. Jemimah Rodrigues
Also Read: Congress: తెలంగాణలో మరో రెండు మంత్రి పదవులు.. ఎవరికి ఛాన్స్ అంటే ?
అప్పటి వరకు లేడీ హీరోగా ఉన్న జెమిమా రోడ్రిగ్స్, ఒక్కసారిగా విలన్ గా మారిపోయారు. మన హిందూ దేశంలో జీసస్ ఎందుకు అని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జీసస్ మన దేవుడే కాదని ఆమెపై మండిపడుతున్నాయి హిందూ సంఘాలు. ఆ ఒక్క మాట అనకుండా ఉంటే, జెమిమా రోడ్రిగ్స్ రియల్ హీరో అయిపోయేదని కామెంట్స్ చేస్తున్నారు కొంత మంది హిందూ వాదులు. ఇలాంటి వాళ్లను టీమిండియా లోంచి తొలగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఫైనల్స్ లో ఆడించకూడదని కోరుతున్నారు. అయితే సెక్యులర్ పార్టీలు మాత్రం హిందూ వాదులను ఖండిస్తున్నారు. కులమత బేధాలు లేకుండా జెమిమా రోడ్రిగ్స్ ను అందరూ అభిమానించాల్సిందేనని కోరుతున్నారు. Jemimah Rodrigues
Also Read: Womens World Cup 2025: వర్షం గండం…ఫైనల్ మ్యాచ్ రద్దయితే.. విజేత ఎవరంటే ?