
Kohli: స్టార్ బెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విరాట్ కోహ్లీ తనదైన ఆట తీరుతో ఎన్నో విజయాలను అందించాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ టెస్టులు, t20 లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కేవలం వన్డేలు, ఐపిఎల్ మ్యాచ్లను మాత్రమే ఆడతానని పేర్కొన్నాడు. ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ ఆర్సిబి జట్టులో కొనసాగుతున్నాడు. 18 సంవత్సరాల పాటు విరాట్ కోహ్లీ ఒకే జట్టులో తన ఆట తీరును కొనసాగిస్తున్నాడు. కొన్ని సీజన్లలో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు.Kohli
Kohli into delhi capitals shock to RCB
2025 ఐపీఎల్ మ్యాచ్లలో ఆర్సిబి జట్టు 18 సంవత్సరాల తర్వాత టైటిల్ సొంతం చేసుకుంది. దీంతో విరాట్ కోహ్లీ అభిమానులు భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. విరాట్ కోహ్లీని పొగడ్తలతో ముంచేత్తారు. అలాంటి అభిమానులకు విరాట్ కోహ్లీ షాకింగ్ న్యూస్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. విరాట్ కోహ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి ట్రేడ్ ప్రక్రియ ద్వారా వెళ్ళబోతున్నట్లుగా ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఆర్సిబిలో ఉన్న కోహ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి మారబోతున్నారట. కోహ్లీ స్థానంలోకి కేఎల్ రాహుల్ లేదా ఇతర ప్లేయర్ ఎవరైనా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. Kohli
Also Read: Jemimah Rodrigues: అప్పటి వరకు హీరో, ఇప్పుడు జీరో.. జెమిమా రోడ్రిగ్స్ పై ట్రోలింగ్స్…
కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయడానికి మరో ఆటగాడు ఆర్సిబి జట్టులోకి రాబోతున్నారు. ప్రస్తుతం కోహ్లీకి ఆర్సిబి జట్టు 20 కోట్ల వేతనం అందిస్తోంది. అంతకన్నా ఎక్కువ వేతనాన్ని ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇవ్వబోతుందట. దీంతో కోహ్లీ ఢిల్లీ క్యాపిటల్ జట్టులోకి వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. విరాట్ కోహ్లీ ఢిల్లీలో జన్మించాడు. ఆ కారణంగా విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ కూడా ఢిల్లీలోనే ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. Kohli
Also Read: Revanth Reddy: రేవంత్ టంగ్ స్లిప్…అజారుద్దీన్ నాయకత్వంలో ఇండియాకు వరల్డ్ కప్ ?