
Chandrababu Car: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన రాజకీయ చరిత్రలో ప్రతిపక్ష నాయకుడిగా అలాగే ముఖ్యమంత్రిగా, జాతీయస్థాయి నాయకుడిగా ఎన్నో సేవలు అందించారు చంద్రబాబు నాయుడు. అయితే అలాంటి చంద్రబాబు నాయుడు పాత వాహనాలను కూడా చాలా జాగ్రత్తగా వాడుతారు. అలాంటి వాటిలో పాత అంబాసిడర్ కారు ఒకటి. రెండు రోజులుగా చంద్రబాబుకు సంబంధించిన అంబాసిడర్ కారు వైరల్ గా మారింది. Chandrababu Car
special story on Chandrababu Car
1995 సంవత్సరంలో ఈ కారును చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో వాడారు. ఈ కారు నెంబరు 393. ఎన్ని వాహనాలు వచ్చిన సరే ఈ కారులో మాత్రమే చంద్రబాబు నాయుడు ప్రయాణించేవారు. అప్పట్లో ఈ కార్లే బాగా ఫేమస్. ముఖ్యమంత్రి హోదాలో హైదరాబాద్ గల్లీలో అలాగే వేలాది కిలోమీటర్లు కూడా ఇదే కారులో ప్రయాణించారు చంద్రబాబు నాయుడు. 393 అని నెంబర్ చంద్రబాబుకు కలిసి వచ్చిందట. ఆయనకు స్టార్ వచ్చేలా చేసిందట. అందుకే ఈ కారణం అపురూపంగా కాపాడుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.Chandrababu Car
Also Read: Revanth Reddy: రేవంత్ టంగ్ స్లిప్…అజారుద్దీన్ నాయకత్వంలో ఇండియాకు వరల్డ్ కప్ ?
ప్రస్తుత కాలంలో బుల్లెట్ ప్రూఫ్ అంటూ కొత్త కార్లు రావడంతో ఈ కారును పక్కకు పెట్టారు కానీ… దాని పైన ప్రేమ మాత్రం ఏ మాత్రం తగ్గించుకోలేదు. ఇప్పటికీ ఈ కారు చంద్రబాబు నాయుడు దగ్గరే ఉంది. మొన్నటి వరకు హైదరాబాదులోని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈ కారును పార్క్ చేశారు. తాజాగా అమరావతికి కూడా దీన్ని తీసుకువచ్చారు. ప్రస్తుతం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో కారును పార్క్ చేయనున్నారట. ఇలా చంద్రబాబు నాయుడు తనకు నచ్చిన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. Chandrababu Car
Also Read: Jemimah Rodrigues: అప్పటి వరకు హీరో, ఇప్పుడు జీరో.. జెమిమా రోడ్రిగ్స్ పై ట్రోలింగ్స్…