Politics

Venkata Ramana Reddy: BRS పార్టీలోకి కేసీఆర్ ను ఓడించిన నాయ‌కుడు?

Venkata Ramana Reddy
Venkata Ramana Reddy

Venkata Ramana Reddy: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ హడావిడి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో… భారతీయ జనతా పార్టీ పరిస్థితి రోజురోజుకు క్షీణించిపోతుంది. ఆ పార్టీని లీడ్ చేసే నాయకుడు కనిపించడం లేదు. భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి బండి సంజయ్ ఇలాంటి వాళ్లకు వస్తే పరిస్థితి వేరే లాగా ఉండేది. Venkata Ramana Reddy

Venkata Ramana Reddy into BRS

కానీ రామచంద్రరావుకు పదవి బాధ్యతలు ఇవ్వడంతో చాలామంది లీడర్లు డీలా పడిపోయారు. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారట. భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పి, గులాబీ పార్టీ కండువా కప్పుకొని ఎందుకు ఆయన సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కేసీఆర్ ను మెచ్చుకుంటూ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడారు. దీంతో ఆయన పార్టీ మారబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. Venkata Ramana Reddy

Also Read: Jemimah Rodrigues: అప్ప‌టి వ‌ర‌కు హీరో, ఇప్పుడు జీరో.. జెమిమా రోడ్రిగ్స్ పై ట్రోలింగ్స్‌…

గులాబీ పార్టీలోకి త్వరలోనే ఆయన వెళ్తారని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే ఎన్ని ప్రభుత్వాలు మారిన భారతీయ జనతా పార్టీలోనే మొదటి నుంచి వెంకటరమణారెడ్డి ఉన్నారు. అలాంటి వ్యక్తి పార్టీ మారతారా ? అనేది చర్చ నీయాంశ‌మైంది. అయితే వచ్చే ఎన్నికల సమయానికి పార్టీ మారే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు కొంతమంది విశ్లేషకులు. Venkata Ramana Reddy

Also Read: Revanth Reddy: రేవంత్ టంగ్ స్లిప్‌…అజారుద్దీన్ నాయకత్వంలో ఇండియాకు వరల్డ్ కప్ ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *