
Vishnu Priya: విష్ణు ప్రియ తాజాగా వర్ష హోస్టుగా చేసే కిస్సిక్ టాక్ షోలో పాల్గొని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టింది. ఈ నేపథ్యంలోనే తన తల్లి హాస్పిటల్లో ఉన్న సమయంలో వేణు స్వామి చేసిన పనిని కూడా లైవ్ లోనే చెప్పేసింది. మరి ఇంతకీ విష్ణు ప్రియ తల్లి హాస్పిటల్ లో ఉంటే వేణు స్వామి ఏం చేశారు.. ఆమె మాటల్లోనే విందాం.. విష్ణు ప్రియ కిస్సిక్ టాక్ షో లో మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.అందులో విష్ణుప్రియ మట్లాడుతూ..
Vishnu Priya revealed the truth about Venu Swamy on live
మా అమ్మ హాస్పిటల్ కి వెళ్లడానికి డబ్బులు లేక చాలా రోజులు మందులు కూడా కొనుక్కోలేదు. మా అమ్మకి డయాబెటిస్ కూడా ఉంది. కొన్ని కొన్ని సార్లు డబ్బులు లేక టాబ్లెట్స్ వేసుకోలేదు. అలాగే హార్ట్ స్ట్రోక్ వచ్చేంతవరకు అది ఉందని నాకు తెలియదు. ఇక అమ్మను హాస్పిటల్లో జాయిన్ చేయడానికి డబ్బులు లేకనే నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాను. అమ్మ హాస్పిటల్ ఖర్చుల కోసమే ఆ తప్పు పని చేశా. అలాగే మా అమ్మను హాస్పిటల్ లో చేర్పించిన సమయంలో మూడు రోజుల కంటే ఎక్కువ బతకదని డాక్టర్లు చెప్పేశారు.(Vishnu Priya)
Also Read: Allu Sirish: అల్లు శిరీష్ కి కాబోయే భార్య ఆ స్టార్ హీరోకి బంధువా..2 ఏళ్లుగా ఇంత నడిపించాడా.?
కానీ నా అదృష్టం కొద్ది సంవత్సరం పాటు బతికింది. ఇక అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు బిల్లు లక్షల్లోనే అయింది.కానీ అప్పుడు నా చేతిలో డబ్బులు లేవు. దాంతో ఎవరికి ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వలేదు.కానీ వేణు స్వామికి ఫోన్ చేయడంతోనే నాకు డబ్బులు పంపించారు. ఆయన గురించి ఎవరెవరో ఏమేమో అనుకుంటారు.కానీ ఆయన చాలా మంచివారు. ఆయన నాకు చాలా రోజుల నుండి తెలుసు. అలా అమ్మకి హాస్పిటల్ బిల్లుకు అయ్యే ఖర్చు వేణు స్వామి పంపించారు.

ఇక అమ్మ చనిపోయిన సమయంలో నేను చాలా బాధపడ్డాను. నన్ను కూడా ఆ దేవుడు తీసుకెళ్తే బాగుండు కదా అని ఎన్నో రోజులు ఏడ్చాను. ఇప్పుడిప్పుడే అమ్మ చనిపోయిన బాధ నుండి బయటపడుతున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది విష్ణు ప్రియ.అలా విష్ణు ప్రియ ఆ షోలో వేణు స్వామికి గురించి ఓ షాకింగ్ విషయాన్ని బయట పెట్టడంతో వేణు స్వామి లో ఇంత మంచి మనస్తత్వం ఉందా అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు.(Vishnu Priya)