Health 

Toor Dal: కందిపప్పు విప‌రీతంగా తింటున్నారా..అయితే డేంజ‌ర్ లో ప‌డ్డట్టే ?

Toor Dal: కందిపప్పు చాలామంది ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలకు కూడా పప్పు వేసి అన్నం తినిపిస్తూ ఉంటారు. కందిపప్పులో ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తాయి. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నవారు కందిపప్పును అస్సలు తినకూడదు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు కందిపప్పును తిన్నట్లయితే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. మూత్రపిండాల రోగులు కందిపప్పును తినడం పూర్తిగా మానుకోవాలి. కందిపప్పులో పొటాషియం అధికంగా ఉంటుంది. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కందిపప్పును తిన్నట్లయితే పొటాషియం స్థాయిలు రక్తంలో పేరుకు పోతాయి. దానివల్ల మూతపిండాల సమస్యలు అధికంగా పెరుగుతాయి. కందిపప్పును ఎక్కువగా తిన్నట్లయితే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. Toor Dal

Toor Dal health issues

అధిక యూరిక్ యాసిడ్ శరీరంలో ఎక్కువగా ఉన్నవారు కందిపప్పును తినకూడదు. కందిపప్పులో ప్యూరిన్లు ఎక్కువగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగి కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులకు దారితీస్తుంది. యూరిక్ యాసిడ్ రోగులు కందిపప్పుకు బదులుగా పెసరపప్పు లేదా మైసూర్ పప్పును తినడం మంచిది అది కూడా పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. కడుపునొప్పి జీర్ణసంబంధ సమస్యలతో బాధపడేవారు కూడా కందిపప్పును తినడం మానుకోవాలి. దానివల్ల జీర్ణ సమస్యలు ఏర్పడతాయి. కందిపప్పులో ప్రోటీన్లను జీర్ణ వ్యవస్థ జీర్ణం చేయడానికి అధికంగా సమయం తీసుకుంటుంది. దీనివల్ల అజీర్ణం, గ్యాస్, గుండెల్లో మంట లాంటి సమస్యలు వస్తాయి. కందిపప్పు గ్యాస్, మలబద్ధకం సమస్యలను పెంచుతుంది.Toor Dal

Also Read: Revanth Reddy: రేవంత్ టంగ్ స్లిప్‌…అజారుద్దీన్ నాయకత్వంలో ఇండియాకు వరల్డ్ కప్ ?

దానివల్ల వాపు లేదా అధిక రక్తస్రావం ఏర్పడుతుంది. కడుపు సంబంధ సమస్యలు ఉన్నవారు కందిపప్పు బదులు సులభంగా జీర్ణం అయ్యే పెసరపప్పును పరిమితంగా తీసుకోవాలి. కందిపప్పు తినడం వల్ల కొంతమందికి అలర్జీ సమస్యలు కూడా వస్తాయి. అలాంటి వారు కందిపప్పును తినకూడదు. ఇది ఒక రకంగా అలర్జీ సమస్యలను ప్రేరేపిస్తుంది. ఈ ప్రోటీన్ శరీరంలో విష వాయువులు విడుదలయ్యేలా చేస్తుంది. దీనివల్ల చర్మంపై దద్దులు, దురద లేదా ఇతర అలర్జీ సమస్యలు ఏర్పడతాయి. ఎలాంటి సమస్యలు లేని వారు మాత్రమే కందిపప్పును తీసుకోవాలి. కందిపప్పును వారంలో ఒకసారి మాత్రమే తినాలి. అంతకుమించి తిన్నట్లయితే గ్యాస్ సమస్యలు వస్తాయి. దానివల్ల కడుపునొప్పి, ఉబ్బరం ఏర్పడుతుంది. ఆ కారణంగా కందిపప్పును పరిమిత పరిమాణంలో తీసుకోవడమే ఆరోగ్యానికి చాలా మంచిది. Toor Dal

Also Read: Jemimah Rodrigues: అప్ప‌టి వ‌ర‌కు హీరో, ఇప్పుడు జీరో.. జెమిమా రోడ్రిగ్స్ పై ట్రోలింగ్స్‌…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *