
Mega Family: ఈ విషయంలో కచ్చితంగా నందమూరి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీని చూసి నేర్చుకోవాల్సిందే..అయితే ఇది నేను అంటున్న మాటలు కాదు.. మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న సాన్నిహిత్యం చూసి సోషల్ మీడియా జనాలు అంటున్న మాట.. ఇక అసలు విషయం ఏమిటంటే రీసెంట్గా అల్లు ఫ్యామిలీలో ఒక శుభకార్యం జరిగింది. అదే అల్లు శిరీష్ నయనిక ఎంగేజ్మెంట్.. అయితే ఈ నిశ్చితార్ధానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరై సందడి చేశారు.
In that regard Nandamuri family is always after Mega Family
అయితే చాలా రోజుల నుండి మెగా, అల్లు ఫ్యామిలీ ఇలా మధ్య గొడవలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ కి మెగా ఫ్యామిలీ మొత్తం రావడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయితే ఈ విషయంలో నందమూరి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీని చూసి నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే మెగా ఫ్యామిలీ మధ్య ఎన్నో గొడవలు ఉన్నట్టు అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. కానీ ఏదైనా ఫంక్షన్ గానీ పండగ గానీ వచ్చిందంటే కచ్చితంగా ఒకే దగ్గర చేరిపోతారు.(Mega Family)
Also Read: Vishnu Priya: లైవ్ లో వేణు స్వామి గురించి నిజం బయటపెట్టిన విష్ణు ప్రియ.. మా అమ్మ హాస్పిటల్…
కానీ నందమూరి ఫ్యామిలీ మాత్రం తమ మధ్య ఉన్న గొడవల్ని ఎప్పటికప్పుడు బయట పెడుతూనే ఉంటారు. ముఖ్యంగా నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ లను ఎన్టీఆర్ ఫ్యామిలీ పూర్తిగా దూరం పెడుతోంది. ఒకప్పుడు కళ్యాణ్ రామ్ ని నందమూరి కుటుంబం చాలా బాగా చూసుకునేది. కానీ ఎప్పుడైతే ఎన్టీఆర్ కి కళ్యాణ్ రామ్ దగ్గరయాడో అప్పట్నుండి కళ్యాణ్ రామ్ ని కూడా దూరం పెడుతోంది.

ఏది ఏమైనప్పటికీ ఎన్ని గొడవలు ఉన్నా ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు ఇలా గొడవలన్ని మర్చిపోయి ఒకే దగ్గర కలిసిపోతేనే కుటుంబం బాగుంటుంది అని,ఈ విషయంలో నందమూరి కుటుంబం మెగా ఫ్యామిలీని చూసి నేర్చుకోవాలి అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. మరి ఎన్టీఆర్ బాలకృష్ణల మధ్య విభేదాలు ఎప్పుడు తొలుగుతాయో..ఎప్పుడు నందమూరి ఫ్యామిలీ మొత్తాన్ని ఒకే ఫ్రేమ్లో చూసి ఆనందించే అవకాశం వస్తుందో చూడాలి.(Mega Family)